Karur Stampede: ఆ నియామకాలు చెల్లవ్.. విజయ్ సర్కార్కు హైకోర్టులో షాక్
Here's what's trending across India right now:
చెన్నై: విజయ్‌ ప్రభుత్వానికి (CM Vijay) మద్రాస్‌ హైకోర్టులో (Madras HighCourt) ఎదురుదెబ్బ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో (Karur Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే.. అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని పేర్కొంది. ‘‘ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదు. దాన్ని కష్టపడి సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు'' అని వ్యాఖ్యానించింది.
Adding to this, గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన టీవీకే ( TVK ) ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి కరూర్‌ వెళ్లి అర్హతలున్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు.
Meanwhile, దీనిపై అన్నాడీఎంకే నేత ఆర్‌.బి. ఉదయ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన విధానాలను పక్కనపెట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత తీవ్రంగా శ్రమిస్తున్నారని, ప్రభుత్వం ఏ ఉద్యోగ నియమాక ప్రక్రియ చేపట్టినా తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే చేపట్టాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం సీఎం విజయ్‌ చేపట్టిన ఈ నియామకాలు చెల్లబోవని తీర్పునిచ్చింది.
Notably, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
As per the latest buzz, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
In further updates, This website follows the DNPA Code of Ethics .
Source: Eenadu