trending

Dharmendra Pradhan: ఎన్నింటినో నెగ్గారు.. అలా ‘పరీక్ష’ తప్పారు

Dharmendra Pradhan: ఎన్నింటినో నెగ్గారు.. అలా ‘పరీక్ష’ తప్పారు

Here's what's trending across India right now:

ఈనాడు, దిల్లీ: ఏదైనా రాష్ట��రంలో భాజపాను గట్టెక్కించాలంటే అధిష్ఠానానికి మొదట స్ఫురించే వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్‌! కీలక మంత్రిత్వశాఖలను చక్కబెట్టాలంటే వినిపించే పేరు అదే!! అలాంటిది ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష' (నీట్‌) పత్రం లీక్‌ కావడం చివరకు ఆయన మెడకు చుట్టుకుంది. 2024లోనూ నీట్, యూజీసీ-నెట్‌ (జాతీయ అర్హత పరీక్ష) ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత ఆయన వివాదాల్లో పడినా పదవికి ఎసరు వచ్చేంత సెగ తగల్లేదు. ఈసారి ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా ఆయన గద్దె నుంచి వైదొలగితేనే తాము దీక్ష విరమిస్తామని విద్యార్థులు విస్పష్టంగా తెగేసి చెప్పడంతో ఆయన ప్రస్థానంలో ఒక్కసారిగా కుదుపు చోటుచేసుకుంది. చివరకు వైదొలగాల్సి వచ్చింది.

Adding to this, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో ప్రభుత్వం తరఫున కీలక పాత్ర పోషించిన ధర్మేంద్ర ప్రధాన్‌ 1969 జూన్‌ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఉత్కళ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీలో పీజీ చేశారు. 1983లో అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నుంచి విద్యార్థి రాజకీయాలు ప్రారంభించారు. 2000లో ఒడిశాలోని పల్లాల్‌హరా నుంచి తొలిసారి శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 2004లో దేవ్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి దిగువ సభకు ఎన్నికయ్యారు. 2004-06 మధ్య భాజపా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ సేవలందించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్యక్ష ఎన్నికల పోరుకు దూరంగా ఉన్నా, 2010లో పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2012లో బిహార్‌ నుంచి, 2018లో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Meanwhile, 2024లో ఒడిశాలోని సంబల్‌పుర్‌ నుంచి మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 మే 26 నుంచి కేంద్ర పెట్రోలియంశాఖ సహాయ మంత్రిగా, పునర్వ్యవస్థీకరణలో 2017 నుంచి అదే శాఖకు క్యాబినెట్‌ మంత్రిగా పని చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు పెట్రోలియంశాఖ లభించింది. కొన్నాళ్లపాటు ఉక్కుశాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ బాధ్యతలూ నిర్వర్తించారు. 2021 జులై 7 నుంచి శనివారం వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.

Notably, బిహార్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల ఎన్నికల బాధ్యుడిగా ధర్మేంద్ర వ్యవహరించారు. 2021లో పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ ఎన్నికల పోరును ఆయనే పర్యవేక్షించారు. ఆ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ ఓడిన విషయం తెలిసిందే. ఒడిశాలో మొదటిసారిగా 2024లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావడం వెనుక ప్రధాన్‌ కీలక పాత్ర పోషించారు.

As per the latest buzz, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

In further updates, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

On top of that, This website follows the DNPA Code of Ethics .

Source: Eenadu