Shambo Shiva Shambo: సూపర్హిట్ ఫిల్మ్ ‘శంభో శివ శంభో’ రీ-రిలీజ్.. ట్రైలర్ చూశారా?
Here's what's trending across India right now:
ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ, శివ బాలాజీ, అల్లరి నరేశ్‌ కీలక పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘శంభో శివ శంభో' (Shambo Shiva Shambo). 2010లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమ స్నేహితుడి ప్రేమను గెలిపించడానికి ముగ్గురు స్నేహితులు ఎలాంటి సాహసం చేశారు? దాని వల్ల వారి జీవితాలు ఎలా మారాయి? చివరకు ప్రేమ గెలిచిందా? స్నేహం గెలిచిందా? అన్న అంశంతో సముద్రఖని దీన్ని తీర్చిదిద్దారు. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1న ‘శంభో శివ శంభో'ను ఎంపిక చేసిన థియేటర్స్‌లో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్‌ను మీరూ చూసేయండి. ఈ వార్త చదివారా: ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. 25కు పైగా చిత్రాలు/సిరీస్లు
Adding to this, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
Meanwhile, This website follows the DNPA Code of Ethics .
Source: Eenadu