ott release movies telugu: ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. 25కు పైగా చిత్రాలు/సిరీస్లు
Here's what's trending across India right now:
Nagabandham Ott || విరాట్‌ కర్ణ కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా మూవీ ‘నాగబంధం'. నభా నటేశ్, ఐశ్వర్య మేనన్‌ కథానాయికలు. అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. జులై 3న విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ( Amazon Prime Video ) వేదికగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ముడిపడిన కథను ఒక విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దారు. (రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)
Adding to this, case of kondana ott || ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచుతూ ఉంటాయి పోలీస్‌ డ్రామాలు. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కన్నడ థ్రిల్లర్‌ ‘కేస్‌ ఆఫ్‌ కొండాన'. విజయ్‌ రాఘవేంద్ర, భావన మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. కన్నడలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో ( ETV Win ) స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలియకుండా చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వరుసగా తప్పులు చేస్తూ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఆసక్తికర కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు.
Meanwhile, pallichattambi ott || కేరళలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘పళ్లిచట్టంబి'. టొవినో థామస్, కయాదు లోహర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి డిజో జోస్‌ ఆంటోని దర్శకత్వం వహించారు. థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఇప్పుడు సోనీలివ్‌ (Sony Liv) వేదికగా మలయాళంతో పాటు, తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. (రివ్యూ కోసం క్లిక్‌చేయండి)
Notably, బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో రూపొందిన సిరీస్‌ ‘ముసాఫిర్‌ కెఫే' (Musafir Cafe ott). రుచిర్‌ అరుణ్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ని టెరిబ్లీ టైనీ టేల్స్, స్టోరీ టెల్లింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థలు నిర్మించాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ( Netflix ) హిందీతో పాటు, తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
As per the latest buzz, purushaha ott || పవన్‌ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో వీరు ఉలవల రూపొందించిన చిత్రం ‘పురుషః'. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.
In further updates, ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
On top of that, గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
Source: Eenadu